సీఎం సహాయనిధి పేదలకు వరం
తార్నాక , పెన్ పవర్సీఎం సహాయనిధి పేదలకు వరం అని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అన్నారు. గురువారం నాచారం డివిజన్ లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, నాచారం కార్పొరేటర్ శాంతి సాయి జెన్ శేఖర్ లు అందచేసారు. రామకృష్ణ కు 60 వేల రూపాయలు , నరసింహాచారి 38 వేల రూపాయలు, భాగ్యమ్మ అరవై వేల రూపాయలు, సయ్యద్ ఇస్మాయిల్ 60 వేల రూపాయల చెక్కులను అందచేశారు. ఈ సందర్భంగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, నాచారం కార్పొరేటర్ శాంతి మాట్లాడుతూ, అత్యవసర ఆరోగ్య సమస్యలున్న వారికి అపన్న హస్తంగా సీఎం రిలీఫ్ ఫండ్ నిధి ఉపయోగ పడుతుందన్నారు. దీని ద్వారా అనేకమందికి భరోసా కలిగిస్తున్నది అని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు సాయి జన్ శేఖర్, కట్ట బుచ్చన్న గౌడ్, సువర్ణ సుగుణాకర్ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment