అర్హులైన మహిళలకు కుట్టుమిషన్ శిక్షణ సర్టిఫికెట్ అందజేత
గౌతమి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సభ్యులు సోమారపు లావణ్య
రామగుండం , పెన్ పవర్రామగుండం కార్పోరేషన్ పరిధి 39వ డివిజన్ పరిధిలోని గౌతమి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత కొన్ని నెలలుగా టైలరింగ్ శిక్షణ పొందిన పలువురు మహిళలకు బిజెపి మోర్చా రాష్ట్ర నాయకురాలు సోమారపు లావణ్య చేతుల మీదుగా అర్హులైన మహిళలకు శిక్షణ పత్రాలు అందజేశారు. అలాగే మహిళ సాధికారత గురించి ఆమె మాట్లాడుతూ ఆర్థిక స్వావలంబన దిశగా మహిళలు ముందుకు వెళ్లాలని అన్ని రంగాలలో తమదైన ముద్ర వేసుకోవాలని పిలుపునిచ్చారు. పిఎం ముద్ర యోజన పథకంలో ఈ సర్టిఫికెట్ ద్వారా మహిళలు బ్యాంకు నుండి ముద్ర లోన్స్ కూడా పొంద వచ్చునని ఆమె తెలియజేశారు.
No comments:
Post a Comment