పరిశోధించారు... పతకాన్ని సాధించారు
విశాఖ ద్వారాకానగర్,పెన్ పవర్
ఆంధ్ర వైద్య కళాశాల పెథాలజి విభాగ జూనియర్ వైద్యులు డాక్టర్ కిల్లాన సంతోష్ రూప అండాశయ క్యాన్సర్ కు కారణాలపై పరిశోధన సాగించారు. ఇమ్మోనో హిస్టో కెమిస్ట్రీ ( ఐ. హెచ్.సి. ) ఆధారంగా సి.కె. 7 , సి.కె. 20 పద్దతిలో కొనసాగించామని , క్లినికల్ పరిశీలనలో పెద్ద ప్రేగు , పొట్ట భాగాల నుండి వచ్చే క్యాన్సర్ కారణాలవల్ల కూడా అండాశయా క్యాన్సర్ లు అధికంగా వస్తున్నట్టు తన పరిశోధనలో తేలిందని ఆమె వివరించారు. అంతేకాకుండా ఆయా కారణాలను వ్యాధి ప్రారంభ దశలో గుర్తిస్తే వ్యాధి గ్రస్తులకు కీమో మరియు రేడియో తెరఫీ ల అవసరం లేకుండానే శస్త్ర చికిత్స ద్వారా క్యాన్సర్ ను నయం చేయవచ్చని సూచించారు. 60 మంది పేషెంట్ ల నుండి నమూనాలను సేకరించి వాటిని పెథాలజి ప్రొఫెసర్ డాక్టర్ ఎ. భాగ్యలక్ష్మి పర్యవేక్షణలో పరిశోధన చేసి పరిశోధన పత్రం రూపొందించారు. ఈ పత్రానికి బహుమతిగా డాక్టర్ ఇ. పెద వీర్రాజు రజత పతకం లభించింది. పరిశోధన లో కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చిన డాక్టర్ కిల్లాన సంతోష్ రూప ను అందరూ అభినందించారు.
No comments:
Post a Comment