Followers

ఆకాశాన్ని అంటిన చికెన్ ధరలు

 ఆకాశాన్ని అంటిన చికెన్ ధరలు..తగ్గిన వ్యాపారాలు..

పేదవాడికి చికెన్ తినడం కలగా మారుతున్న తరుణం..

 కేసముద్రం,  పెన్ పవర్

రాష్ట్రస్థాయి ఎండలు విజృంభిస్తున్న తరుణంలో బ్రాయిలర్ కోడి రేటు ఆకాశాన్ని అంటుతున్నాయి సామాన్యునికి అందుబాటులో లేక పోవడం అరకిలో కొన్ని సగటు మనిషి పావు కిలో కొనుక్కో పోతున్నాడు ఒకపక్క   కరోణ విజృంభిస్తున్న తరుణంలో మరోపక్క పిల్లలకు స్కూల్ లేక ఇంటిలోనే ఉంటున్నారు. వారానికి ఒక రోజు చికెన్ కొనుక్కొని తిందామనుకున్నా సగటు మనిషి ఆశలు ఆడియశలు గా మిగిలిపోతున్నది, గత పది రోజుల క్రితం 80 రూపాయలు ఉన్న కోడి నేడు 150 రూపాయలకు అమ్ముతున్నారు చికెన్ చికెన్ 180 కి అమ్మగా నేడు 260 కి అమ్ముతున్నాడు చికెన్ 200 రు అమ్మగా  280 రూపాయలకు పెరిగిందన్నారు.  దీనికంతటికీ కారణం బ్రాయిలర్ కోళ్ళు కోళ్ల ఫారం లో పెంచడం తగ్గిపోయిందని బ్రాయిలర్ కోడి పెంపకాలు లేకపోవడం అధిక ఉష్ణోగ్రత ఉండడంతో కోళ్ల షెడ్ ఖాళీగా ఉంచుతున్నామన్నా రు.  కోళ్ల ఫారం యజమానులు తెలియజేస్తున్నారు. గత పది రోజుల క్రితం ఉన్న గిరాకీ సగానికి పైగా పడిపోయాయని చికెన్ షాప్ యజమానులు తెలియజేశారు. ఇప్పటికే చిన్న చిన్న చికెన్ షాపులు మూతపడ్డాయని ఇలాగే ఉంటే షాపులు బంద్ చేసుకోవాల్సి వస్తుందని దానికి కారణం వ్యాపారాలు లేకపోవడం ఎండవేడిమికి కోళ్ళు సప్లై లేకపోవడం కారణమని చికెన్ షాప్ .యాజమానులు వాపోతున్నారు. ఏదేమైనా ధర తక్కువగా ఉంటేనే వ్యాపారం ఎక్కువ సాగుతుందని సగటు మనిషి ఒక్కపూటైనా కోడిమాంసం తింటారని వాళ్ల తింటేనే మా బ్రతుకులు బాగుంటాయని లేకపోతే మళ్లీ వేరే పనులు చేసుకొని బతకాల్సి వస్తోందని కేసముద్రం చికెన్ షాప్ యజమానులు తెలియజేశారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...