మండు వేసవి లో నిండు కుండలా చెక్ డ్యాం
పెన్ పవర్, పెద్ద గూడూరుఫలించిన భరత్ కుమార్ రెడ్డి కృషి పచ్చని మాగాణిగా మారనున్న పదివేల ఎకరాలు ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు కృతజ్ఞతలు తెలిపిన భరత్ కుమార్ గోదావరి జలాలతో సిఎం ఫ్లెక్సి కీ జలాభిషేకం చినుకు కురిసింది. నీరు కదిలింది. ఏరు పారింది. రెండు మూడు నెలలు నీటి గలలు! ఆ తర్వాత అంతా నిశ్శబ్దం! పల్లమెరిగిన నీరు పారిపోతుంది! ఏరు ఒట్టిపోతుంది! మరి… పారే నీటిని ఒడిసిపడితే! అక్కడక్కడ పట్టి నిలిపితే! అది పచ్చదనానికి బాటలు వేస్తుంది. జలసిరికి దారులు చూపుతుంది. భూగర్భ జలాలకు ఆయువు పట్టుగా మారుతుంది! ఇది.. మహబూబబాద్ జిల్లా గూడూరు మండలంలో ఫలించిన ప్రయోగం. నేటి బంగారు తెలంగాణకు ఆదర్శం! దీనికి కారణం… టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, భీరవెల్లి భరత్ కుమార్ రెడ్డి. వీరిద్దరు చెక్‌డ్యామ్‌లతో గూడూరు మండల రూపు మార్చేశారు. అభివృద్ధి పనులకు తన నియోజకవర్గాన్ని చిరునామాగా మార్చారు. మహబూబబాద్ జిల్లా గూడూరు మండలంలోనీ మున్నేరు వాగు పై నాలుగు చెక్ డ్యాంలు మంజూరు కాగా, గూడూరు చెక్ డ్యాం పూర్తైంది. వరదలా పారుతున్న నీరు ను చూసి, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు మండు వేసవి, ఎండలు సుర్రు మంటుంటే నీరు గలా గలా వరదలా పారుతుంది. గతంలో ఈ వాగు బీడు పోయి ఉండేది. నేడు జలాలతో కళకళాడుతుంది. 2002 లో ఆనాటి ఉద్యమ నేత, నేటి సిఎం కేసిఆర్ ఇచ్చిన హామి కార్యరూపం దాల్చింది. దీంతో పదివేల ఎకరాల బీడు భూములు పచ్చని మాగాణి గా మారనున్నాయి. ఈ సందర్భంగా టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి భరత్ కుమార్ రెడ్డి కేసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపాడు. పార్టీ శ్రేణులతో కలిసి చెక్ డ్యాం వద్ద సిఎం కేసిఆర్ ఫ్లెక్సీ కీ గోదావరి జలాలలో జలాభిషేకం నిర్వహించాడు. నాలుగు చెక్ డ్యాంలు ఇచ్చి, రైతులను ఆదుకున్న సిఎం కేసిఆర్ కు ఋణపడి ఉంటామని ఆయన తెలిపాడు ఉద్యమనేత సిఎం అయితే ఎలాగుంటుందో, ఇక్కడి చెక్ డ్యాంలే సమాధానమిస్తాయని టిఆర్ఎస్ అధికార ప్రతినిధి నూకల సురేంధర్ అన్నారు.
No comments:
Post a Comment