మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలి.....
మండల విద్యాధికారి రవీందర్
లక్షెట్టిపెట్, పెన్ పవర్మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలి అని ఎంఈఓ రవీందర్ అన్నారు. శనివారం పట్టణంలో న్యూ లైఫ్ ప్రేయర్ సొసైటి ఆధ్వర్యంలో ఇండియా బైబిల్ లిట్రేచర్ సహకారంతో నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా ఎంఈఓ రవీందర్ పాల్గొని మాట్లాడుతూ న్యూలైఫ్ సొసైటీ చేస్తున్న సేవ కార్యక్రమలను అభినందించారు.నిరుపేద మహిళలకు ఉపాధి కల్పించాలన్న ఆలోచన చాలా గొప్పదన్నారు.రానున్న రోజుల్లో మరిన్ని సేవ కార్యక్రమలు అందిచి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. అనంతరం మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు బొడ్డు రవిజోషాప్, సభ్యులు తగారపు సత్తయ్య, సంజీవ్, గంధం సత్యనారాయణ, పుష్ప, స్వరూపరాణి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment