కరోనా బారిన పడి మరణించిన జర్నలిస్టుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి.
- తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు తొట్ల మల్లేష్ యాదవ్.
మంచిర్యాల , పెన్ పవర్కరోనా బారిన పడి మరణించిన జర్నలిస్టుల కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గోట్ల. మల్లేష్ శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఒకేరోజు నలుగురు జర్నలిస్టులు మరణించడం బాధాకరమని అన్నారు. కరోనా తో మరణించిన జర్నలిస్టుల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి జర్నలిస్టుల రక్షణ కొరకు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. రెండో దశ కరోనా వేగంగా విజృంభిస్తున్న తరుణంలో జర్నలిస్టులకు ప్రభుత్వం మెరుగైన వైద్య సహాయం అందించాలని డిమాండ్ చేశారు. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు మీడియా అకాడమీ నుండి 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయాలని కోరారు. ప్రభుత్వానికి ప్రజలకు వారిది గా ఉండే సేవలు అందిస్తున్న జర్నలిస్టును ఆదుకోవాలని జర్నలిస్టులకు ప్రతినెలా ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకులు అందజేయాలని కోరారు. కరోనా వ్యాధిని హెల్త్ కార్డు లో చేర్చి ఆసుపత్రిలో జర్నలిస్టులకు ప్రత్యేక వార్డులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
No comments:
Post a Comment