ఐఎన్ టిఎస్ఓ పరీక్షలలో విద్యార్థుల ప్రతిభ
మందమర్రి, పెన్ పవర్ఐఎన్ టిఎస్ ఆన్ నైన్ పరీక్షలలో ప్రతిభ కనబరచిన శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులను శుక్రవారం పాఠశాల ప్రిన్సిపల్ ఆయుబ్ అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, ఐ ఎన్ టి ఎస్ పరిక్షలలో శ్రీ చైతన్య పాఠశాల కు చెందిన విద్యార్థులు రెండో లెవల్ కు అర్హత సాధించినట్లు పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా శ్రీ చైతన్య విద్యార్థులు ఎంపిక కావడం సంతోషంగా ఉందని అన్నారు. మందమర్రి కి చెందిన 26 మంది విద్యార్థులు ఎంపిక అయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీన్ సంజీవ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment