శ్రీ అంకమ్మ తల్లి, బాబా స్తూపానికి వితరణ
పెన్ పవర్, కందుకూరు
పట్టణంలోని శ్రీ అంకమ్మ తల్లి దేవాలయం పునర్నిర్మాణానికి మచిలీపట్నం వద్ద గల గూడూరులో 108 అడుగుల బాబా స్థూపానికి ఏపీఎస్ఆర్టీసీ డి ఎం శ్రీమన్నారాయణ స్థానిక శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి సమక్షంలో వెంకట రెడ్డికి విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి మాట్లాడుతూ అంకమ్మ తల్లి దేవాలయం అభివృద్ధికి 5116 రూపాయలు, బాబా స్తూపానికి 5116 రూపాయలు అందజేసిన శ్రీమన్నారాయణ కు వారి కుటుంబ సభ్యులకు అంకమ్మ తల్లి, బాబా కృప కటాక్షాలు ఎల్లవేళలా ఉంటాయని అన్నారు. మచిలీపట్నం వద్ద గూడూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న 108 అడుగుల బాబా స్థూపానికి రాబోయే కాలంలో ప్రపంచవ్యాప్త గుర్తింపుతో ఆధ్యాత్మిక కేంద్రంగా మారబోతున్నదని, దాతల సహకారం మరువలేనిదని దాతలు అందరికీ బాబా ఆశీస్సులు ఆశీస్సులు తప్పక ఉంటాయని మహీధర్ రెడ్డి కోరారు.
No comments:
Post a Comment