గోరంట్ల చే ప్రశంసలు పొందిన ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు మరియు పర్వతారోహకుడు
రాజమహేంద్రవరం, పెన్ పవర్
ఇటీవల టాంజానియా దేశంలోని ప్రపంచంలోనే ప్రముఖ మరియు క్లిష్ట మయిన కిలిమంజోరో పర్వత శిఖరాన్ని అధిరోహించి భారత దేశానికి మరియు తెలుగు జాతికి కీర్తిప్రతిష్టలు తెచ్చిన ఆచంట ఉమేష్ కుమార్ నేడు తన తండ్రి ఆచంట బాలాజీ తో కలిసి రాజమహేంద్రవరం గ్రామీణ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరిని మర్యాదపూర్వకంగా కలిసారు. ఆచంట ఉమేష్ కుమార్ సాధించిన ఘనత పట్ల గోరంట్ల సంతోషం వ్యక్తం చేసి శాలువా కప్పి సత్కరించారు.ఉమేష్ కుమార్ మన ప్రాంతంలో ఎంతోమంది యువకులకి తను సాధించిన విజయాల ద్వారా స్పూర్తిని నింపాడని అలాగే వొక్కొక్క మెట్టు పైకెక్కుతూ మరిన్ని చారిత్రిక విజయాలు సాధించాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
No comments:
Post a Comment