పోలమాంబ అమ్మవారిని దర్శించుకున్న వంశీకృష్ణ శ్రీనివాస్,పద్మజ దంపతులు
విశాఖ తూర్పు, పెన్ పవర్
శ్రీ శ్రీ శ్రీ కరకచెట్టు పొలమాంబ ఆలయ వార్షిక మహోత్సవం సందర్భంగా వైసీపీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్,పద్మజ దంపతులు అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.అమ్మవారికి పసుపు,కుంకుమ,చీరను సమర్పించారు.అమ్మవారి పూజ అనంతరం ఆలయ అర్చకులు తీర్ధ ప్రసాధములు స్వీకరించారు.
అనంతరం అమ్మవారి ప్రతిమ ను అందజేశారు.వంశీకృష్ణ మాట్లాడుతూ 14 గ్రామాలకు ఆరాధ్య దైవమైన అమ్మవారు పూజ లో పాల్గొనడం సంతోషం కలిగిందని అన్నారు.అమ్మవారి శక్తితో కరొనా ను త్వరలో తరిమివేస్తుందని అన్నారు. అంగరంగ వైభవంగా భారీ ఏర్పాట్లు కు కరొనా అడ్డంకిగా మారిందని,అందరూ ఆరోగ్యంతో అమ్మవారు దయతో వచ్చే సంవత్సరం ఘనంగా జరుపుకోవచ్చు అన్నారు.కార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment