Followers

మహమ్మారి కరోనా నివారణకు ప్రతి ఒక్కరు సహకరించాలి...

మహమ్మారి  కరోనా నివారణకు ప్రతి ఒక్కరు సహకరించాలి...

 ఐరాల, పెన్ పవర్

పూతలపట్టు నియోజకవర్గం,ఐరాల మండలం లో కరోనా మహమ్మారి నివారణకు ప్రతి ఒక్కరు ప్రభుత్వ ఆదేశాలను పాటించి పోలీస్ వారికి సహకరించాలని ఐరాల ఎస్.ఐ. శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. శనివారం అయిన మీడియాతో మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తుండడంతో ప్రభుత్వం వైరస్ నివారణకు కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు బహిరంగ ప్రదేశాల్లో తిరిగే సమయంలో తప్పకుండా మాస్కులు ధరించాలని లేకుంటే జరిమానా విధిస్తామని తెలిపారు. 

కళ్యాణ మండపం, సినిమా హాలు, ఫంక్షన్ హాల్ లో వంటి ప్రదేశాల్లో మాస్కులు ధరించడం తో పాటు కరోనా నిబంధనలు పాటించే విధంగా ఆ యాజమాన్యం చర్యలు తీసుకోవాలన్నారు. లేకుంటే యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా గ్రామాల్లో  ప్రజలు గుంపులుగా ఉండడం గాని ఎక్కడైనా  పిల్లలు చెరువులు, బావులు వద్ద ఈతకు వెళ్తే వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ కరోనా నియంత్రణకు సహకరించాలని ఆయన తెలిపారు. ఈ కరోనా నీ మండలం నుంచే కాకుండా ఈ దేశం నుండి తరిమి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రోడ్డుపై మాస్కో లేకుండా తిరుగుతున్న వారివి  పిలిచి, విచారించి, తగిన సూచనలు తెలియజేసి ఉచితంగా మాస్క ల ను అందించిన ఎస్ ఐ శ్రీకాంత్ రెడ్డి .

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...