Followers

ఎన్నికల బరిలోకి దిగనున్న తేదేపా

ఎన్నికల బరిలోకి దిగనున్న తేదేపా

సంతబొమ్మాలి,పెన్ పవర్

సంతబొమ్మాళి మండలంలో జిల్లా, మండల పరిషత్ ఎన్నికలలో అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తామని తేదేపా మండల పార్టీ అధ్యక్షులు జీరు భీమారావు తెలిపారు. సంతబొమ్మాలి మండల కేంద్రంలో శనివారం  మండల తేదేపా నాయకులు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. అధినేత ఎన్నికలలో పాల్గొనవద్దని, ఎన్నికల బహిష్కరించాలని పిలుపునిచ్చినా పార్టీ మనుగడ, పార్టీ పురోగతి దృష్ట్యా ఎన్నికలలో పోటీ చేస్తున్నామని తెలిపారు. ఈ మేరకు మండలంలోని 20 ఎంపీటీసీ స్థానాలు, జెడ్పిటిసి స్థానానికి జరుగనున్న ఎన్నికలలో అన్ని స్థానాల్లో పోటీ చేయాలని తీర్మానం చేశారు. మండలం లోని తెదేపా నాయకులు రెడ్డి అప్పన్న, కర్రీ విష్ణుమూర్తి, ధర్మార్జున్రెడ్డి,  తేదేపా జెడ్ పి టి సి అభ్యర్థి పుక్కల్ల శ్రీను, వసంతరావు, 20 మంది తెదేపా అభ్యర్ధులు, కార్యకర్తలు, తెదేపా మద్దతు సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...