మహనీయుల జీవిత చరిత్రలను స్పూర్తిగా తీసుకోవాలి...
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న
రాంజీ గోండ్ కు ఘనంగా నివాళ్ళు సమర్పించిన ఎమ్మెల్యే జోగు రామన్న
ఆదిలాబాద్, పెన్ పవర్స్వాతంత్ర పోరాటంలో ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసిన మహనీయుల జీవిత చరిత్రలను స్పూర్తిగా తీసుకుంటూ వారి ఆశయాలను సాధించే దిశగా పాటు పడాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న పిలుపునిచ్చారు. శుక్రవారం గిరిజనులు ఆరాధ్య దైవంగా కొలిచే రాం జీ గోండ్ 164 వ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు తో కలిసి ఆయన పాల్గొన్నారు. స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదుట గల రాం జీ గోండ్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళ్ళు అర్పించారు. అదే విధంగా గోండుల స్వేచ్చా జెండాను ఎగురవేశారు. ఈ మేరకు జోగురామన్న మాట్లాడుతూ హక్కుల సాధనకు అసువులు బాసిన రాం జీ గోండ్ త్యాగాలు మరవలేనివని అన్నారు. 1957 తిరుగుబాటులో సైతం కీలక పాత్ర పోషించారని, బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశారని గుర్తు చేసుకున్నారు. అటువంటి మహనీయులను ఆదర్శంగా తీసుకుంటూ వారి ఆశయ సాధనకు పాటు పడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ గోడం నగేష్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారి సతీష్, ఆదివాసి నాయకులూ, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment