సినీ నిర్మాత గేయరచయిత తైదల బాపు రేపు పుట్టినరోజు పురస్కరించుకొని
కోవిడ్ పరీక్షకు వ్యాక్సిన్ తీసుకోవడానికి వచ్చేవారికి పండ్లు మంచినీరు అందిస్తున్నారు
తాండూర్, పెన్ పవర్
అభినవ స్వచ్చంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో నేటి నుండి ప్రభుత్వ దవాఖానలో కోవిడ్ పరీక్షల నిమిత్తం వచ్చేవారికి , వ్యాక్సిన్ తీసుకోవడానికి వచ్చేవారికి పండ్లు మరియు మంచినీరు అందించారు , అలాగే కరోన మహమ్మారి బారిన పడి వంటచేసుకోలేని స్థితిలో ఉన్న. పాజిటివ్ వచ్చిన ముగ్గురి కుటుంబాలకు భోజనాలు , బ్రెడ్ , జామ్ ,పండ్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు మొదటి రోజు ప్రముఖ సినీ గేయ రచయిత , నిర్మాత తైదల బాపు జన్మదినం జన్మదినం రేపు ఆదివారం సందర్భంగా ఈ కార్యక్రమలు ప్రారంభించినట్లు అభినవ సంతోష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తైదల బాపు సోదరులు శ్రీనివాస్ , మల్లేష్ , సేవాసంస్థ సభ్యులు పోట్లపల్లి రాజ్ కిరణ్ , లక్ష్మణ్ , నరేష్ , హరీష్ , హస్పెటల్ సిబ్బంది పద్మ , నవిత , నరేష్ , హకీమ్ , లక్ష్మమ్మ ,ఆరోగ్యమిత్ర లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment