Followers

ఛత్తీస్ ఘడ్ లో బీభత్సం సృష్టించినమావోయిస్టులు.......

ఛత్తీస్ ఘడ్ లో బీభత్సం సృష్టించినమావోయిస్టులు...

చింతూరు, పెన్ పవర్

మావోయిస్టులు సోమవారం భారత్ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఛత్తీస్ ఘడ్ లో భీభత్సం సృష్టించారు. ఆదివారం రాత్రి సుకుమా జిల్లా ఎర్ర బోరు గ్రామ సమీపంలో రోడ్డు అడ్డంగా చెట్లను నరికి వేసి లారీలను ఆపు చేసి లారీల ట్యాంకర్లు గడ్డలతో పగలగొట్టి డీజిల్ ను 7 లారీల పై చల్లి దగ్ధం చేశారు.  పోలీస్ క్యాంపు కు కూతవేటు దూరంలోనే ఈ సంఘటన జరగటంతో ఎర్ర బోరు క్యాంప్ నుండి సిఆర్పిఎఫ్ జవాన్లు వెళ్లేసరికి బాణాలు, రాళ్లతో దాడి చేశారు. దీంతో సిఆర్పిఎఫ్ జవాన్లు వెనక్కి తగ్గాల్సి వచ్చింది.

ఈ ఘటనలో సుమారు వందమంది భూంకాల్ మిలిషియా సభ్యులు పాల్గొన్నట్టు సమాచారం. అలాగే సోమవారం ఉదయం కుంట తహాసిల్ పరిధిలోని దొండ్ర గ్రామ సమీపంలో జాతీయ రహదారి 30 పై సిమెంట్ పోల్స్ రోడ్ కు అడ్డంగా వేసి రాకపోకల కు అంతరాయం కలిగించారు. ఇదిలా ఉండగా భేజి రోడ్ లో చెట్లను నరికి అడ్డంగా వేసి రాకపోకల కు అంతరాయం కలిగించారు. చింతూరు మండలం లోని బొడ్డుగూడెం నుండి సరివేల గ్రామాల మధ్య మావోయిస్టులు సోమవారం కరపత్రాలు రోడ్ పై వెద జల్లారు. మావోయిస్టుల బంధు కారణంగా విశాఖ పట్టణం, రాజమహంద్రవరం,కాకినాడ ల నుండి భద్రాచలం, హైదరాబాద్ వెళ్లే బస్సులు ముందుగానే రద్దు చేశారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...