Followers

నా చావుకు ఏవరు కారణం కాదు.....జీవితంపై విరక్తితో చనిపోతున్నా

 నా చావుకు ఏవరు కారణం కాదు .....జీవితంపై విరక్తితో చనిపోతున్నా

మీరందరు మంచొళ్ళే అమ్మ బాపును  చూసుకొండి.

పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని గురుకుల పాఠశాల సీనీయర్ అసిస్టెంట్ మృతి



ఎల్లారెడ్డిపేట, పెన్ పవర్

ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలోనీ  ఏండి రంజాన్ బాయి ఇంటిలో అద్దెకుంటున్న  మరిమడ్ల ప్రభుత్వ గురుకుల పాఠశాలలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న సుల్తానాబాద్ కు చెందిన పి.మల్లేశం నేత (40 ) సోమవారం ఉదయం 11-20  గంటల సమయంలో అద్దె గదిలో   సూసైడ్ నోట్ రాసి ప్యాడ్ కు పెట్టీ అనంతరం   బాత్ రూమ్ గదిలోకి వెళ్ళి గడియా పెట్టుకొని  తన ఓంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని మరణించాడు. అతడు అద్దెకుంటున్న గదిలో ప్యాడ్ కు రాసిపెట్టిన నోట్ లో నా చావుకు ఎవరూ కారణం కాదు, జీవితంపై విరక్తితో చనిపోతున్నాను, మా పెద్దక్క  చిన్నక్క మా చెల్లి బావలు అందరూ మంచివారే అమ్మను బాపును చూసుకొండి. నాకు రావాల్సిన ఆస్తి మొత్తం శ్రీ కాంతి మరియు సన్నీకి ఇవ్వండి నా యొక్క గురుకుల జర్నీ లో ఎన్నో కస్ట,సుఖాలను చూశాను.  నా యొక్క 22 సంవత్సరాల గురుకుల జర్నీలో ఏవరైనా ఇబ్బంది పెడితే నన్ను క్షమించండి నాతో జర్నీలో చేసిన గురుకుల మిత్రులందరికీ నమస్కారం ఇక సెలవు అంటూ రాసి పెట్టిన  సూసైడ్ నోటోలో మల్లేశం పేర్కొన్నారు. సంఘటన స్థలాన్నీ  ఏఏస్ఐ కిషన్ రావు పరీశీలించి  కేసు నామోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నారు.  మృతదేహాన్ని పోస్ట్ మార్టం కొరకు జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...