Followers

మాస్క్ ధరించకపోతే కరోనా వ్యాధి నుండి ముప్పు తప్పదు

 మాస్క్ ధరించకపోతే కరోనా వ్యాధి నుండి ముప్పు తప్పదు

విజయనగరం, పెన్ పవర్

కోవిడ్ వ్యాధి వ్యాప్తి నియంత్రణకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని, కోవిడ్ నిబంధనలైన వ్యక్తుల మధ్య భౌతిక దూరం పాటించడం, సానిటైజరు లేదా సబ్బును ఉపయోగించి తరుచూ చేతులను శుభ్రం చేసుకోవడం, నోరు, ముక్కు కప్పి ఉండే విధంగా మా ను ధరించడం చేయాలని ప్రజలకు జిల్లా ఎస్పీ బి. రాజకుమారి ఏప్రిల్ 22, గురువారం నాడు పిలుపునిచ్చారు. రోజు రోజుకు కరోనా కేసులు, మృతులు సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా ప్రతీ ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి, కరోనా నియంత్రణకు సహకరించాలన్నారు. 2వ వేవ్ కరోనా ప్రభావంత చాలా తీవ్రంగా ఉందని, ప్రజలంతా అప్రమత్తతతో వ్యవహరించి, కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జాగ్రత్తలు పాటించడంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా, ప్రాణాలు కోల్పోయే ప్రమాదం పొంచి వుందని నిజాన్ని విస్మరించరాదన్నారు. 2వ వేవ్ కోవిడ్ 19 వైరస్ చాలా ప్రమాదకరంగా మారిందని, వ్యాధి లక్షణాలు ఒక్కొక్కసారి కనిపించకుండానే మనుష్యులను ప్రమాదకర పరిస్థితుల్లోకి తీసుకుపోతున్నదన్నారు. వ్యాధిని గుర్తించేలోగనే వ్యాధి తీవ్రస్థాయికి వెళ్ళిపోతుందన్నారు. కావున, అనుమానం ఉన్న ప్రతీ ఒక్కరూ త్వరితగతిన కోవిడ్ పరీక్ష చేసుకోవడం, వ్యాధిని గుర్తించడం, చికిత్స పొందడం చాలా అవసరమన్నారు. కోవిడ్ పరీక్ష వచ్చే వరకు హెూం ఐసోలేషనులో ఉండడం శ్రేయస్కరమన్నారు. హెూం ఐసోలేషను ఉండడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వ్యాది ఇతర కుటుంబ సభ్యులకు వచ్చే ప్రమాదం ఉందన్నారు. కోవిడ్ సోకిన వ్యక్తులు అనవసరంగా ఆందోళన చెందవద్దని, మానసికంగా ధృడంగా ఉండడంతోపాటు, చికిత్స పొందితే ప్రాణాపాయ స్థితి నుండి బయటపడతామన్నారు. అవకాశం ఉన్న ప్రతీ ఒక్కరూ కోవిడ్ వ్యాధి నిరోధక వాక్సిన్ వేయించుకోవాలన్నారు. ప్రజలను నిరంతరం అప్రమత్తం చేసేందుకు రాష్ట్ర డిజిపి శ్రీ గౌతం సవాంగ్, విశాఖపట్నం రేంజ్ డిఐజి శ్రీ ఎల్.కే.వి.రంగారావు ఆదేశాలతో ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా సంబంధిత పోలీసు అధికారులు, సిబ్బంది చర్యలు చేపడుతున్నారన్నారు. అయినప్పటికీ, మాస్క్ ధరించడంలో ప్రజలు, యువత నిర్లక్ష్యం వీడడం లేదన్నారు. కరోనా ప్రబలే విపత్కర సమయంలో మాస్క్ ధరించకుండా తిరుగుతున్న వారిపై ఇప్పటి వరకు 1,07,223 కేసులు నమోదు చేసి, వారిపై రూ. 84లక్షల 98వేల 705ల జరిమానాలుగా విధించామని జిల్లా ఎస్పీ బి. రాజకుమారి తెలిపారు. మాస్కు ధరించకపోతే మరింత కఠినంగా వ్యవహరించక తప్పదని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...