Followers

మేయర్ గద్వాల విజయలక్ష్మి కుత్బుల్లాపూర్ లో పర్యటన

 మేయర్ గద్వాల విజయలక్ష్మి కుత్బుల్లాపూర్ లో పర్యటన.. 

పైపులైను రోడ్డులోని డంపింగ్ యార్డ్ ను సందర్సదించి పరిశీలించిన మేయర్.. 

చెత్తను రోడ్డు పక్కన డంప్ చేయవద్దని అధికారులకు సూచించారు.. 

డంపింగ్ యార్డ్ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు.. 

మేయర్ వెంట కార్పోరేటర్లు..జోనల్ కమీషనర్ పర్యటనలో పాల్గొన్నారు.. 


కుత్బుల్లాపూర్, పెన్ పవర్ 

హైదరాబాదు మేయర్ గద్వాల విజయలక్ష్మి కరోనాను కూడా లెక్కచేయకుండా మహానగరంలో పర్యటిస్తున్నారు.. గురువారం ఆకస్మికంగా కుత్బుల్లాపూర్ లో ప్రత్యక్షమై పర్యటించిన ఆమె.. శుక్రవారం కూడా అధికారులు కార్పోరేటర్లతో మరోసారి కుత్బుల్లాపూర్ లో పర్యటించారు.. గాజులరామారం సర్కిల్ జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలో హెచ్ఎంటి ఖాళీ ప్రదేశంలోని పైపులైను రోడ్డులో ఉన్న డంపింగ్ యార్డ్ ను మేయర్ సందర్శించారు.. గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు స్థానిక కార్పొరేటర్లు కొలుకుల జగన్,మంత్రి సత్యనారాయణ, రావుల శేషగిరిరావు, కూకట్‌పల్లి జోనల్ కమీషనర్ వి.మమత పర్యటించారు.. ఈ సందర్భంగా మేయర్  ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు .అనంతరం ఆమె మాట్లాడుతూ చెత్తాచెదారాన్ని రోడ్ల వెంట పడ వేయకుండా డంపింగ్ యార్డ్ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈకార్యక్రమంలో కుత్బుల్లాపూర్ ఉప కమిషనర్ రవీందర్  కుమార్, యూత్ నాయకులు కొలుకుల జైహింద్, నాయకులు. పాపయ్య గౌడ్. వేణు రుద్ర అశోక్.మల్లారెడ్డి. పాపిరెడ్డి బాలరాజు .హజ్రత్ అలీ. దాసు. బ్రహ్మచారి. మహేందర్ ,ఇందిరా గౌడ్, సువర్ణ, మురళి గణేష్ హజ్రత్ అలీ యాదగిరి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...