Followers

ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురి కాకుండా కాపాడాలి

 ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురి కాకుండా కాపాడాలి: కలెక్టర్ కి వినతిపత్రం అందజేత

కేసముద్రం, పెన్ పవర్ 

సోమవారం కేసముద్రం మండలం కేసముద్రం విలేజ్ గ్రామ పంచాయితీ పరిధిలోని పూలే విగ్రహం ఎదురుగా 262 ప్రభుత్వ సర్వే నెంబర్ అయినా ఆర్ అండ్ బి శాఖ కు చెందిన భూమిలో అక్రమంగా ఇల్లు నిర్మాణం చేయుచున్నారు కావున ఇట్టి నిర్మాణాన్ని ఆపివేసి స్థలాన్ని ఆక్రమణకు గురి కాకుండా ఆపివేయాలని కలెక్టర్ కి కేసముద్రం మండల  ఎంసిపిఐ (యు) కార్యదర్శి మర్రిపెల్లి మొగిలి వినతి పత్రం అందజేశారు. వినతి పత్రం లోని వివరాల ప్రకారం కేసముద్రం విలేజ్ గ్రామపంచాయతీ పరిధిలోని పూలే విగ్రహం వద్ద ఎదురుగా ఉన్న 262 సర్వేనెంబర్ కలిగిన ఆర్ అండ్ బి శాఖకు చెందిన ప్రభుత్వ భూమిలో అక్రమంగా కేసముద్రం విలేజ్ గ్రామ పంచాయతీకి చెందిన భానోత్ శంకర్ నాయక్, గాజ గోని వీరన్న,లు అనే ఇద్దరు వార్డు సభ్యులు కలిసి  ఒక ఇంటిని నిర్మాణంచేస్తున్నారని పైగా ఇంటి నిర్మాణానికి గ్రామ పంచాయతీ నుండి ఎలాంటి అనుమతి లేకుండా వార్డు సభ్యులుగా అధికారం ఉందని యదేచ్చగా నిర్మాణం చేపట్టారని తెలియపరిచారు. మేము ఈ నిర్మాణం పై కేసముద్రం తహసీల్దార్, ఎంపీడీఓ, లకు వినతిపత్రాన్ని అందజేశాము. అయినా ఈ అక్రమ నిర్మాణం కొనసాగుతూనే ఉంది కావున కలెక్టర్ స్పందించి ప్రజలకు ఉపయోగపడే భూమిని ఆక్రమణకు గురి కాకుండా కాపాడాలని తెలియజేశారు. ఈవినతిపత్రం అందచేతలో పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు ఎన్ను ఎల్లయ్య, పార్టీ మండల కమిటీ సభ్యుడు జాటోత్ బిచ్చ నాయక్ , బొల్లోజు మాధవాచారి లు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...