Followers

మందమర్రి ఏరియాలోని జిఎం కార్యాలయంలో ఉత్పత్తి ఉత్పాదకత పై డైరెక్టర్ వీడియో కాన్ఫరెన్స్

 మందమర్రి ఏరియాలోని జిఎం కార్యాలయంలో ఉత్పత్తి ఉత్పాదకత పై డైరెక్టర్ వీడియో కాన్ఫరెన్స్

పెన్ పవర్,  మందమర్రి 

మందమర్రి ఏరియాలోని జిఎం కార్యాలయంలోనీ, సమావేశ మందిరంలో డైరెక్టర్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ బలరాం ఈరోజు కరోన కోవిడ్ ముందస్తు జాగ్రత్త గురించి వాటి ఏర్పాట్ల గురించి మరియు బెల్లంపల్లి రీజియన్ గనుల్లో ఉత్పత్తి ఉత్పాదకత పై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు డైరెక్టర్ మాట్లాడుతూ  సంస్థ చైర్మన్ యం డి శ్రీధర్, పాఠశాల మేరకు సింగరేణి, వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియా ఆస్పత్రుల్లో కోవిడ్ వైద్య సేవలు కోసం ముందస్తుగా అవసరమైన మందులు ఆక్సిజన్ సిలిండర్లు వస్తున్నామని ఏరియాలలో ప్రస్తుత బెడ్ లకు అదనంగా మరో 500 బెడ్ లతో ప్రత్యేక అవార్డులు ఏర్పాటు చేసుకొని సింగరేణి సంస్థ డైరెక్టర్లు ఏరియా జనరల్ మేనేజర్ ఆదేశాలు జారీ చేశారు మే నెలలో కేసులో ఉదృతి మరింత పెరిగే అవకాశం ఉన్నందున ఇప్పటినుండి ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి అన్ని ఏరియా ఆసుపత్రులను సిద్ధ పరచాలని, వారు కోరారు ఆక్సిజన్ కొరతతో ఏర్పడకుండా ఉండేందుకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇతర పరిశ్రమల తో సంప్రదింపులు జరుపుతున్నామని సింగరేణి కి ప్రత్యేకించి ఆక్సిజన్ సిలిండర్ సమకూర్చు ఉంటామని తెలిపారు ఈ లోపు స్థానికంగా ఆక్సిజన్ కొనుగోలు చేయాలని కోరారు రాపిడ్ పరీక్షలు నిర్వహించడం కోసం 25, వేల ఇట్లు ప్రభుత్వం నుండి సేకరించామని వీటిని ఏరియాలకు పంపిస్తున్నట్లు తెలిపారు ప్రస్తుతం ఏరియా ఆస్పత్రిలో ఉన్న బెడ్ లకు అదనంగా మరికొన్ని బెడ్ లను ఏర్పాటు చేస్తున్నామన్నారు స్థానిక భవనాలలో కోవిడ్ వదులుగా ఏర్పాటు చేసుకోవాలని అని సూచించారు చైర్మన్ అనుమతితో 20 మంది వైద్య నిపుణులు నియమించడం జరిగింది ఇంకా అవసరమైన వార్డు బాయ్ నర్సులు సిబ్బందిని స్థానికంగా నియమించుకోవాలని జిమ్ లకు ఆదేశించారు, ర్యాపిడ్ టెస్టులు ఎక్కువగా చేయడంవల్ల వ్యాధి గుర్తింపు నివారణ సులభం అవుతుందని పేర్కొన్నారు. ఆక్సిజన్ కార్యక్రమంపై కూడా సమీక్షించారు. సింగరేణి కార్మికులు అందరికీ మే ఈ నెల ఆఖరికి వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రత్యేక కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసుకొని కో వీడు పేషెంట్లను గుర్తిస్తూ ఐసోలేషన్ సెంటర్లకు తరలిస్తూ వ్యాధి తీవ్రరూపం దాల్చకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు గత ఏడాది టీం వర్క్ తో కోవిడ్ వలన, సింగరేణి సంస్థ ఎక్కువ నష్టం జరగలేదని సింగరేణి తీసుకున్న ప్రత్యేక చర్యల కు కేంద్ర బొగ్గు మంత్రి శాఖ వారు ప్రత్యేక ప్రశంస తెలిపారు ఈ ఏడాది కూడా అదే ఒరవడితో ముందుకు పోవాలని సూచించారు. ఆస్పత్రులు కావలసిన ఇంజక్షన్లు మందులు ఎప్పటి కప్పుడు సమకూర్చడం జరుగుతుందని వివరించారు. విధినిర్వహణలో ఉన్న డాక్టర్ల కు సిబ్బందికి 10 శాతం అదనపు వేతనాన్ని చెల్లించడానికి యజమాన్యం సిద్ధంగా ఉందన్నారు అలాగే ఉత్పత్తి ఉత్పాదకత బొగ్గు నాణ్యత ప్రమాణాలు గూర్చి ఏరియా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ విపత్తు పరిస్థితుల్లో రక్షణతో కూడిన ఉత్పత్తి ఉత్పాదకతకు తీసుకోవాలని అన్నారు అధికారులకు తగు సూచనలను సలహాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేట్ డైరెక్టర్ జిఎం ఎన్విరాన్మెంట్ రవి ప్రసాద్ మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ ఎస్ ఓ టు జిఎం గోపాల్ సింగ్ ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...