కరోనా నివారణకు ప్రతి ఒక్కరు సహకరించాలి
తవణంపల్లి మండలంలో కరోనా మహమ్మారి నివారణకు ప్రతి ఒక్కరు ప్రభుత్వ ఆదేశాలను పాటించి పోలీస్ వారికి సహకరించాలని తవణంపల్లి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం అయిన మీడియాతో మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తుండడంతో ప్రభుత్వం వైరస్ నివారణకు కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు బహిరంగ ప్రదేశాల్లో తిరిగే సమయంలో తప్పకుండా మాస్కులు ధరించాలని లేకుంటే జరిమానా విధిస్తామని తెలిపారు. కళ్యాణ మండపం సినిమా, హాలు, ఫంక్షన్ హాల్ లో వంటి ప్రదేశాల్లో మాస్కులు ధరించడం తో పాటు కరోనా నిబంధనలు పాటించే విధంగా ఆ యాజమాన్యం చర్యలు తీసుకోవాలన్నారు. లేకుంటే యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా గ్రామాల్లో ఎక్కడ ప్రజలు గా ఉండడం గాని సహపంక్తి భోజనాలు చేయడం గాని ఎక్కడైనా నా పిల్లలు చెరువులు బావులు వద్ద ఈతకు వెళ్తే వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ కరోనా నియంత్రణకు సహకరించాలని తెలిపారు. ఇదిలా ఉండగా, ఈ నెలలో మాస్కులు ధరించండి వారిపై ఆరు వందల కేసులు నమోదు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఇక మీదట కూడా ప్రతి ఒక్కరూ మాస్కులతో సామాజిక దూరంతో మండలంలోని ప్రతి ఒక్కరూ నియమాలు పాటిస్తూ కరోనా ని ఎదుర్కోవాలని తెలిపారు.
No comments:
Post a Comment