నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన వంశి
విశాఖ తూర్పు, పెన్ పవర్
శ్రీ శ్రీ శ్రీ సీతారామ సేవా సంఘం, పాత వెంకోజిపాలెం గ్రామ కమిటీ నూతన కార్యవర్గం వైసీపీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ ని శివాజిపాలెం నివాసంలో మర్యాద పూర్వకంగా కలసి పుష్పగుచ్చెమ్ అందజేశారు. గ్రామ అభివృద్ధి కి నిరంతరం కృషి చేయాలని, తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడు వుంటాయని అన్నారు.నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన కర్రి శ్రీను ని కమిటీ కి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అప్పలరాజు, సెక్రెటరీ ఆడారి శివ ప్రసాద్, కోశాధికారి వాసు, జాయింట్ సెక్రటరీ రమేష్, చంద్ర శేఖర్ తో పాటు వైసీపీ సీనియర్ నాయకులు పీలా వెంకట పరదేసి నాయుడు పాల్గొన్నారు.
No comments:
Post a Comment