దేశంలోనే మైనార్టీల సంక్షేమానికి ఆదర్శంగా తెరాస ప్రభుత్వం
రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
నిరుపేద ముస్లీం యువతుల వివాహాలకు షాదిముభారక్ పథకం
కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్దికి పట్టం కట్టండి
రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
రామగుండం , పెన్ పవర్మైనార్టీల సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ ప్రభుత్వ నిలుస్తోందని మన రాష్ట్రంలోని ముస్లీంల మైనార్టీల సంక్షేమానికి తెరాస ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మరియు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. సోమవారం గ్రేటర్ వరంగల్ కార్పోరేషన్ పరిధిలోని 36వ, డివిజన్ లో వారు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని మైనార్టీల అభ్యున్నతికి సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ముస్లీం నిరుపేద యువతుల వివాహలకు షాదిమూభారక్ పథకం ద్వారా 1లక్ష116 రూపాయలు అందిస్తున్న ప్రభుత్వం ఏదైన ఉన్నది అంటే అది తెరాస ప్రభుత్వమేనని అంతటి మనసున్న మారాజు సిఎం కేసీఆర్ అని హితవు పలికారు. నిరుపేద ముస్లీం పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేసి ఉచితంగా విద్యను అందిస్తుందన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని వృద్ధులకు భరోసాగా నిలవాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ ఆసరా పథకాన్ని ప్రవేశపెట్టి నెలకు రెండు వేల రూపాయల పెన్షన్ అలాగే దేశంలో ఎక్కడలేని విధంగా ఒంటరి మహిళకు రెండు వేల రూపాయల పెన్షన్ అందిస్తున్న ఘనత సిఎం కెసిఆర్ దేనని అన్నారు. రాష్ట్రంలోని సకల వర్గాల సంక్షేమం కోసం అనునిత్యం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ కి మద్దతుగా మనమంతా నిలవాలని అభివృద్ధికి పట్టం కట్టాలని ఈ నెల 30న, జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిని రిజ్వానా మసుద్ ను గెలిపించడానికి కారు గుర్తు కు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని వారు స్థానాక డివిజన్ ప్రజలను కోరారు.
No comments:
Post a Comment