Followers

అమ్మాపురం గ్రామములో కారోనా హెల్త్ క్యాంప్ ఏర్పాటు.

 అమ్మాపురం గ్రామములో కారోనా హెల్త్ క్యాంప్ ఏర్పాటు.

102 మందికి టెస్టులు నిర్వహించగా, ముగ్గురికి పాజిటివ్ గా నమోదు.

కరోనా రెండవ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

45 సంవత్సరాలు పైబడినవారు తప్పనిసరిగా కారోనా టీకా తీసుకోవాలి.

అమ్మాపురం గ్రామ సర్పంచ్ కడెం యాకయ్య.


తొర్రూరు, పెన్ పవర్

మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని అమ్మాపూరం గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో బుధవారం ప్రభుత్వ వైద్యాధికారులు కారోనా హెల్త్ క్యాంప్ ను ఏర్పాటు చేసి,టెస్టులను నిర్వహించారని, గ్రామ సర్పంచ్ కడెం యాకయ్య అన్నారు.ఈ క్యాంప్ లో 102 మందికి టెస్టులు నిర్వహించగా,ముగ్గురికి పాజిటివ్ గా వచ్చిందని, అన్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ కడెం యాకయ్య మాట్లాడుతూ... కరోనా వ్యాధి నియంత్రణకు గ్రామ ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని, ఎవరికి వారుగా స్వీయ నియంత్రణ పాటించి,కారోనాను తరిమికొట్టాలని, ప్రజలకు పిలుపునిచ్చారు. కారోనా సెకండ్ వేవ్ తొందరగా వ్యాప్తి చెందుతుందని,గ్రామ ప్రజలు ధైర్యంగా ఉండి,పలు జాగ్రత్తలు తీసుకొని,45 సంవత్సరాలు పైబడిన వారు తప్పకుండా కారోనా వ్యాక్సిన్ తీసుకోవాలని, కోరారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆదేశాల మేరకు గ్రామంలో కరోనా కట్టడి చేయాలనే ఉద్దేశంతో కారోనా క్యాంపు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కారోనా పాజిటివ్ వ్యక్తులకు ఆత్మస్థైర్యాన్ని కలిగించడం కోసం ఏఎన్ఎం ఆశ వర్కర్లు ప్రతిరోజు గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండాలని,కరోనా బాధితులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలియజేయాలని, కారోనాతో ప్రజలు ఆధైర్యపడవద్దన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో అద్భుతమైన వైద్యసేవలు అందిస్తున్నారని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి,స్వీయ నియంత్రణ భౌతిక దూరం పాటించాలని, అన్నారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మాచర్ల అరవింద్ గౌడ్,గూడెల్లి సైదులు,పస్తం ఎగమ్మ,హెల్త్ సూపర్ వైజర్ రాము,హెల్త్ అసిస్టెంట్లు కమల, కృష్ణమూర్తి,ఎన్సిడి  సూపర్వైజర్ ఉపేంద్ర, ఆశ వర్కర్లు ఉపేంద్ర, శ్రీలత, గ్రామ ప్రజలు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...