అర్చక,పురోహితులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు మంజూరు చేయాలి...
పెందుర్తి, పెన్ పవర్
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అర్చక పురోహితులకు రాష్ట్ర దేవాదాయ శాఖ ద్వారా గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రైవేట్ అర్చకుల పురోహిత సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి అధికారుల కాళిదాస్ అన్నారు మంగళవారం సుజాతనగర్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో అర్చక పురోహిత సమస్యలను ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వడ్డాది ఉదయ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు జిల్లా వ్యాప్తంగా అర్చకుల సమస్యలపై పోరాడుతున్నామని కరోనా లాక్డౌన్ సమయంలో అర్చక పురోహితులకు తమ సంఘం చేసిన సామాజిక కార్యక్రమాలను వివరించారు. ఇప్పటికే విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్న అత్యధిక పురోహితుల వివరాలు సేకరించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్చక పురోహితులకు అందే విధంగా కృషిచేసినట్లు పేర్కొన్నారు.అర్చకుల సమస్యలను పరిష్కరించడానికి అర్చక పురోహితులకు ఐడెంటిటీ కార్డులు మంజూరు విషయంపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు దృష్టికి తీసుకెళ్తామని ఉదయ కుమార్ హామీ ఇచ్చారు ఈ సమావేశంలో ప్రైవేటు అర్చక పురోహిత సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు అంబడిపూడి సుధీర్ కుమార్ శర్మ మాట్లాడుతూ అర్చక పురోహిత సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు అదేవిధంగా బ్రాహ్మణ కోపరేటివ్ క్రెడిట్ సొసైటీ సభ్యత్వం నమోదు చేయుటకు కృషి చేస్తామని పేర్కొన్నారు.ఈ సమావేశంలో సంఘ జిల్లా సంయుక్త కార్యదర్శి మావూడురు సంపత్ కుమార్ ఇన్చార్జులు ఏలూరు వెంకట రమణ మూర్తి గంటి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment