మే డే ను విజయవంతం చేయాలి....
ఆదిలాబాద్ , పెన్ పవర్135వ మేడే ను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని భుక్తపుర్ లోగల ఐటీయూసీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో యూనియన్ నాయకులతో కలిసి మేడే కు సంబంధించిన గోడ పోస్టర్లు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కారోన వేవ్ రెండవ సారి విస్తృతంగా విజృంభిస్తుంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభించడం సిగ్గుచేటన్నారు. మేడే కార్మికులందరు విజవంతం చేసుకొని రెండవ చికాగో ఉద్యమం ఎలా జరిగిందో ఆవిధంగానే కార్మికులు బీజేపీ ప్రభుత్వనికి వ్యతిరేకంగా మరో ఉద్యమనికి సిద్ధంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. 135వ మేడే ను కారోన జాగ్రత్తలు పాటిస్తూ జరుపుకోవాలని పులునిచ్చారు.ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుంటాల రాములు, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్, సివిల్ సప్లైయ్ యూనియన్ జిల్లా నాయకులు సంబన్న, అప్రోజ్, మున్సిపల్ యూనియన్ జిల్లా నాయకులు కాంతారావు పాల్గొన్నారు.
No comments:
Post a Comment