మన ఉద్యోగాలు మనకే.
మంచిర్యాల , పెన్ పవర్ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క &సుమన్ గారి ఆదేశాల మేరకు.. తెలంగాణ రాష్ట్రంలో 95 శాతం ఉద్యోగాలు స్థానిక యువకులకే దక్కే విధంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్రంలో కొత్త జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడిన శుభ సందర్భంగా చెన్నూరు నియోజకవర్గంలోని ఐదు మండల కేంద్రాలు, మూడు మున్సిపాలిటీలలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం, విద్యార్థి విభాగం, కార్యకర్తలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త జోనల్ వ్యవస్థ పై రాష్ట్రపతి ఉత్తర్వులు ఇవ్వడం వల్ల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. దీని ద్వారా ఉద్యోగ నియామకాలకు అడ్డంకులు తొలగిపోవడమే కాకుండా మెజారిటీ ఉద్యోగాలు స్థానికుల పొందే అవకాశం ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి గొప్ప అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కెసిఆర్ గారు కెసిఆర్ గారి వెంటే నిరుద్యోగులు, యువకులు ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇకపై ఉద్యోగ నియామక ప్రక్రియ వేగవంతం చేస్తూ త్వరలోనే 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు కేటీఆర్ గారు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమాలలో టిఆర్ఎస్వి, టీఆర్ఎస్ వై, కౌన్సిలర్లు, యువ నాయకులు యువకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment