Followers

ఇసరపు రామ కృష్ణల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రం

ఇసరపు రామ కృష్ణల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రం

 విజయనగరం,పెన్ పవర్

 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాల్లో కూడా ముందు ఉండడం ఎంతైనా అభినందనీయమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగం నాయకులు జి ఈశ్వర్ కౌశిక్ అన్నారు. శనివారం నాడు 13 వ డివిజన్ పరిధిలో కొత్తపేట నీళ్ల ట్యాంకు వద్ద కార్పొరేటర్ ఇసరపు రేవతీదేవి, ఇసరపు రామ కృష్ణల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి దృష్ట్యా ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రం పాదచారులకు, వాహనదారులకు ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, సేవా కార్యక్రమాలు చేపట్టడం ఇతరులకు స్ఫూర్తిదాయక ఉన్నారు. డివిజన్ పరిధిలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక ఇంజనీర్ డాక్టర్ దిలీప్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొయ్యాన పైడ్రాజు, కిలన శ్రీను, కొయ్యాన జగదీష్, కొయ్యాన శేఖర్, బొట్టా నారాయణరావు, డివిజన్ పార్టీ పెద్దలు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...