Followers

పాడేరు రైతు భరోసా కేంద్రం వద్ద చెత్తను తొలగించండి

 పాడేరు రైతు భరోసా కేంద్రం వద్ద చెత్తను తొలగించండి

పాడేరు,  పెన్ పవర్

పాడేరు మేజర్ పంచాయతీ రైతు భరోసా కేంద్రం వద్ద పేరుకుపోయిన చెత్తను  తక్షణమే తొలగించాలని , సిపిఐ మండల కార్యదర్శి కూడా రాధాకృష్ణ  ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు గురువారం మాట్లాడుతూ పాడేరు మేజర్ పంచాయతీ పాడేరు ఐటీడీఏ నడిబొడ్డున ఉన్న  రైతు భరోసా కేంద్రం , ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లే మార్గంలో , పేరుకుపోయిన చెత్త ఉండటం వలన , చుట్టుపక్కల ప్రజలు , నడిచి వెళుతున్న ప్రతి  వ్యక్తికి దుర్వాసన వల్ల మరియు పేరుకుపోయిన చెత్త ఉండటం వలన కుక్కల దాడులు మనుషులపై స్వైర విహారం చేస్తుందని , తక్షణమే పేరుకుపోయిన చెత్తను తొలగించాలని , అదేవిధంగా మేజర్ పంచాయతీ చుట్టుపక్కల , చెత్తను కూడా తొలగించాలని వారన్నారు .పాడేరు మేజర్ పంచాయతీ, ప్రధాన రహదారి మినహా  చుట్టుపక్కల అంతా కూడా అపరిశుభ్రంగా ఉంటుందని, చుట్టుపక్కల పేరుకుపోయిన చెత్తను కూడా తక్షణమే తొలగించాలని,  సిపిఐ పార్టీ మండల కార్యదర్శి కూడా రాధాకృష్ణ డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో  జవ్వాది కళ్యాణం తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...