Followers

కోదండ రామ స్వామి ఆలయంలో స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన జిల్లా కలెక్టర్

 కోదండ రామ స్వామి ఆలయంలో స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన జిల్లా కలెక్టర్ 

చిత్తూరు,  పెన్ పవర్

 చిత్తూరు పట్టణ రామాలయం వీధి లోని శ్రీ కోదండ రామ స్వామి వారి ఆలయం లో బుధవారం మధ్యాహ్నం కల్యాణోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. కోదండరామ స్వామి ఆలయానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ కు అర్చక స్వాములు మంగళ వాయిద్యాల నడుమ స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించిన జిల్లా కలెక్టర్ కు అర్చకులు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను సమర్పించారు. దేవస్థానం ఈఓ సుమన ప్రియ, ఉత్సవ కమిటీ సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...