ప్రశ్నిస్తే తప్పుడు కేసులు బనాయింపు
మందమర్రి, పెన్ పవర్మందమర్రి మండలం, పట్టణంలో అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నా అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలు, రియల్ ఏస్టేట్ వ్యాపారం పై ప్రశ్నిస్తే స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ తన అధికార దర్పంతో, పట్టణ పోలీసులచే తప్పుడు కేసులు బనాయిస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్నారని మందమర్రి పట్టణానికి చెందిన హై కోర్ట్ అడ్వకేట్ ఎంవి. గుణ ఆరోపించారు. మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో పలు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్న తనను స్థానిక టిఆర్ఎస్ నాయకులు, పోలీసులు అనేక పర్యాయాలు బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇటీవల గిరిజన భూములను టిఆర్ఎస్ నాయకులు వారి బంధువుల చేత దొంగ పట్టా చేయించుకొని,1/70 చట్టాన్ని తుంగలో తొక్కి, స్వేచ్ఛగా రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తుండగా, బాధితులకు అండగా పోరాటం చేస్తున్నందుకు స్థానిక టిఆర్ఎస్ నాయకులు, పోలీసులు తనపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో అరాచకాలు అధికమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. తప్పుడు ఎస్సీ, ఎస్టీ కేసులను వెనక్కి తీసుకోకపోతే పిటిషన్ దారులు సైతం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని, ఎన్ని ఇబ్బందులకు గురి చేసిన ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పౌరహక్కుల ప్రజా సంఘం కేంద్ర ప్రధాన కార్యదర్శి జయ వింద్యాల, జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షురాలు సహెరు భాను, పౌరహక్కుల ప్రజా సంఘం సభ్యులు విజయ్, ఫిరోజ్, ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment