హోరాహోరీగా వాలీబాల్ పోటీలు
స్థానిక జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో గత రెండు రోజులుగా జరుగుతున్న వాలీబాల్ పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. ఈ పోటీలకు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ ఆహ్వానిత జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో మొదటి మ్యాచ్ లయోలా కాలేజ్ చెన్నై బంగారుపాలెం స్పైకర్ మధ్య జరిగిన పోటీల్లో లయోలా కాలేజ్ చెన్నై గెలుపొందింది. మరో మ్యాచ్లో కోయంబత్తూర్ ఈ రోడ్డు మధ్య జరిగిన పోటీల్లో కోయంబత్తూర్ గెలుపొందింది.
ఈ పోటీలు తిలకించడానికి జిల్లాలో నలుమూలల నుంచి క్రీడా అభిమానులు విచ్చేశారు. ఈ పోటీలు ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఫ్లడ్లైట్ల వెలుతురులో సాగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కుమార్ రాజా ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఇండియన్ వాలీబాల్ ఆటగాడు తులసి రెడ్డి చిత్తూరు జిల్లా వాలీబాల్ కోచ్ సుదర్శన్ నాయుడు, మాజీ వాలీబాల్ క్రీడాకారులు కృష్ణమూర్తి మురారి, దిలీప్, వెంకటేష్, చందు, పెరుమాల్, తిరుమల్ రావు, మురుగేష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment