Followers

పలుకూరు లో కరోనా పై అవగాహన ర్యాలీ

 పలుకూరు లో కరోనా పై అవగాహన ర్యాలీ        


పెన్ పవర్, కందుకూరు 

కందుకూరు మండలం పలుకూరు గ్రామంలో ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి  పిలుపుమేరకు గ్రామంలో పంచాయతీ సెక్రెటరీ సూరిబాబు  ఆధ్వర్యంలో  గ్రామ సర్పంచ్ వీర మల్లి శ్రీను గ్రామంలో కరోనా పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ గ్రామంలోని  అన్ని వీధులను తిరుగుతూ ప్రజలకు కరోనా పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వీరమల్లి శ్రీను మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా రెండో దశ చాలా ప్రమాదకరంగా ఉంటుందని కచ్చితంగా బయటికి వచ్చినప్పుడు మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటించాలని  ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనాను నియమాలను అందరూ కలిసికట్టుగా పాటించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో బ్రహ్మయ్య , వార్డ్ నెంబర్లు,అంగన్వాడి కార్యకర్తలు ,ఆశా కార్యకర్తలు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేశారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...