సంధ్య మూర్తికి మాతృ వియోగం
రాజమహేంద్రవరం, పెన్ పవర్సంధ్య సాయంకాల పత్రిక ప్రకటనల మేనేజర్ పేరూరి సాంబమూర్తి(సంధ్య మూర్తి)కి మాతృ వియోగం కలిగింది. మూర్తి మాతృమూర్తి పేరూరి సుబ్బలక్ష్మి నేటి ఉదయం కన్నుమూశారు. కొద్దికాలంగా అస్వస్థతతో ఉన్న సుబ్బలక్ష్మి ఉదయం 9 నుంచి10 గంటల సమయంలో స్ధానిక ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.ఆమె వయస్సు 60 సంవత్సరాలు. భర్త,ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మరణ వార్త తెలియగానే సంధ్య సాయంకాల పత్రిక సంపాదకులు డాక్టర్ ఎంటివి పట్టాభి రామారావు భౌతిక కాయాన్ని సందర్శించి, నివాళులు అర్పించారు. కుటుంబసభ్యులకు సానుబూతి తెలియజేశారు. సుబ్బలక్ష్మి పార్ధీవ దేహాన్ని వారి సొంత ఊరైన ఆలమూరు మండలం, పెనికేరు గ్రామానికి తరలించారు. ఆలమూరులో శుక్రవారం మధ్యాహ్నం అంత్యక్రియలు జరిగాయి.
No comments:
Post a Comment