బిజెపి రాష్ట్ర మోర్చా అధ్యక్షుడు కోలుకోవాలని ప్రత్యేక పూజలు
పెన్ పవర్, పెద్ద గూడూరు
మూడు రోజుల క్రితం బిజెపి రాష్ట్ర మోర్చా అధ్యక్షులు జాటోతు హుస్సేన్ నాయక్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వైద్యుల సూచన మేరకు హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు హుస్సేన్ నాయక్ వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన వారంతా కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని హుస్సేన్ నాయక్ సూచించారు. దీంతో ఆయన అనుచరులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు కోరోనా నుంచి తమ నాయకుడు హుస్సేన్ నాయక్ త్వరగా కోలుకోవాలని మహబూబబాబ్ జిల్లా గూడూరు మండలంలోని భక్తంజనేయ స్వామి దేవాలయంలో పూజా కార్యక్రమాలు చేపట్టారు. భక్తంజనేయ స్వామి కీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా నుంచి హుస్సేన్ నాయక్ త్వరగా కోలుకోవాలని ఆ పార్టీ నాయకులు ఆకాంక్షించారు. ప్రజాసేవలో భాగంగా తమ నాయకునికి కరోనా సోకిందని, కరోనా మహమ్మారి నీ జయించి, త్వరగా కోలుకోవాలనీ నాయకులు భక్తంజనేయ స్వామి ని ప్రార్థించారు. అనంతరం గూడూరు శివాలయం పూజలు నిర్వహించారు. పరమశివునికీ అర్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చెల్పూరి వెంకన్న, మరియు మండల నాయకులు మేర్గు మల్లయ్య, వడ్లకొండ యాకయ్య, రాజు,దేవెందర్, హరి, బోడ వెంకన్న , రాంబాబు ఈకార్యక్రమంలో పాల్గోన్నారు.
No comments:
Post a Comment