కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రచారం...
ఇంద్రవెల్లి, పెన్ పవర్ఇంద్రవెల్లి మండల కేంద్రంలో కరోనా ఉధృతి రోజురోజుకీ పెరుగుతున్న క్రమంలో మండల కేంద్రంలోని ప్రజలు కోవిడ్ నిభందనలు పాటిస్తు అర్హులైన ప్రతి ఒక్కరు కోవిడ్ వ్యాక్సిన్ ని వేసుకోవాలని ఇంద్రవెల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ కొరెంగ గాంధారి, కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి లు అన్నారు.శనివారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలో పంచాయతీ సిబ్బంది ఆద్వర్యంలో ట్రాక్టర్ పై మైక్ సెట్ పెట్టి కోవిడ్ వ్యాక్సిన్ ప్రతి ఒక్కరు వేసుకోవాలని ప్రచారం నిర్వహించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కోవిడ్ ఉదృతి రోజు రోజుకి పెరుగుతున్న క్రమంలో ప్రజలంతా కోవిడ్ నియంత్రణ కోసం ప్రతి ఒక్కరు మాస్కులను ధరించి, భౌతికదూరం పాటించాలని, అత్యవసరం తప్ప ఎవరు బయటకు రావద్దని, 45 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కోవిడ్ వ్యాక్సిన్ టీకాను వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది గాయక్వాడ్ నారాయణ్, సంజీవ్, క్రాంతి, మానిక్ రావ్, రాందాస్, దిలిప్, గోవింద్ తదితరులు పాల్గొన్నరు.
No comments:
Post a Comment