Followers

జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం

 జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం 

 పెన్ పవర్, ఆత్రేయపురం 

 స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం పురస్కరించుకుని ఎంపీడీఒ నాతి బుజ్జి  పంచాయతీ రాజ్ సిబ్బంది గ్రామ స్వరాజ్యానికై కలలు కన్న పూజ్య బాపూజీ మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా  నివాళులు అర్పించారు.. ఈ సందర్భంగా పంచాయతీ రాజ్ ఉద్యోగులు కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని ఒకరితో ఒకరు పంచుకున్నారు.. ఎంపీడీవో నాతి  బుజ్జి  మాట్లాడుతూ భారతదేశంలో అతి పురాతన వ్యవస్థ అయిన పంచాయతీ రాజ్ శాఖలో పనిచేసే అవకాశం రావడం గొప్ప అదృష్టమనీ, ప్రజలకు ప్రభుత్వ పధకాలను అందించడంలో  ప్రజాప్రతినిధులతో కలిసి పనిచేయడం ఎంతో మంచి అవకాశమనీ ఎంపీడీఒ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ వరప్రసాదరావు, ప్రసాద్ మాష్టారు, సిబ్బంది  వల్లీ, సమీర్, రామకోటి, సాయి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...