Followers

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం

స్వచ్ఛ మల్లేపల్లి గ్రామం గా తీర్చిదిద్దేందుకు కృషి 

మల్లేపల్లి సర్పంచ్ బలిరెడ్డి వరలక్ష్మీ గంగరాజు, ఉపసర్పంచ్ దొమ్మా శ్రీను 

పెన్ పవర్,గండేపల్లి

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అని మల్లేపల్లి గ్రామాన్ని స్వచ్ఛ మల్లేపల్లి గ్రామం గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు చేయి చేయి కలిపి కృషి చేద్దామని మల్లేపల్లి గ్రామ సర్పంచ్ బలిరెడ్డి వరలక్ష్మి గంగరాజు, ఉపసర్పంచ్  దొమ్మా శ్రీను లు పిలుపునిచ్చారు. శుక్రవారం మల్లేపల్లి లోని యువత, మహిళలు, ఆరోగ్యకార్యకర్తలు ఆధ్వర్యంలో పరిసరాల పరిశుభ్రత పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని అన్నపురాజుపేట, పాతూరు, కొత్తూరు, నీలకుండీలపేట ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని వ్యక్తిగత పరిశుభ్రత పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అప్పుడే గ్రామం అన్ని రంగాలలోను అభివృద్ధి చెందుతుందని సూచించారు. గ్రామాన్ని స్వచ్ఛ మల్లేపల్లి గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ తమకు సహాయ సహకారాలు అందించాలని కోరారు.గ్రామంలోని విద్యావంతులు, రిటైర్డ్ ఉద్యోగులు, సీనియర్లతో గ్రామ అభ్యుదయ సమితిని ఏర్పాటు చేయడం జరిగిందని దీని ద్వారా ప్రభుత్వం అనుసంధానంతో గ్రామంలోని వినూత్న కార్యక్రమాలు చేపట్టి గ్రామ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తామన్నారు. ఇందుకు గ్రామంలోని ప్రతి ఒక్కరూ తమకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. రానున్న రోజుల్లో దేశంలోనే మల్లేపల్లి గ్రామానికి ఒక గుర్తింపు తెచ్చే విధంగా చేయాలనేదే తమ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో తాతాజీ మాష్టారు,ఆలేటి రవి, హై స్కూల్ చైర్మన్ బలిరెడ్డి శ్రీను, గొర్రెల శివ, బలిరెడ్డి శ్రీధర్, బత్తుల వీరబాబు, తెలగరెడ్డి భాస్కరరావు, చింతపల్లి సుబ్బారావు, పొంతపల్లి సత్తిబాబు, అధిక సంఖ్యలో మహిళలు, వాలంటీర్లు, విద్యార్థిని విద్యార్థులు, పంచాయతీ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...