కోవిడ్ వార్డుగా భద్రగిరి ఆసుపత్రి
కోవిడ్ బాధితులకు 10పడకలు సిద్ధం
కోవిడ్ నోడల్ అధికారి షణ్ముఖరాజు
గుమ్మలక్ష్మీపురం మండలంలోని భద్రగిరి సామాజిక ఆరోగ్యకేంద్రంలో కోవిడ్ బాధితుల అత్యవసర వైద్యం కోసం 10 కోవిడ్ పడకలను ఏర్పాటు చేసినట్లు గుమ్మలక్ష్మీపురం మండల కోవిడ్ పర్యవేక్షణ అధికారి షణ్ముఖరాజు, భద్రగిరి వైద్యఅధికారి ఉదయ్ కుమార్ తెలిపారు.కోవిడ్ టెస్ట్ చేసుకున్నాక గృహనిర్బంధంలో ఉన్న బాధితుల ఆరోగ్య పరిస్థితి విషమిస్తే తక్షణమే భద్రగిరి ఆసుపత్రికి చేర్చి వారి లక్షణాల తీవ్రతను బట్టీ చికిత్స నిర్వహించి ఆరోగ్యము స్దిరపడితే ఇంటికి లేదంటే మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం, విజయనగరం కోవిడ్ ఆసుపత్రులకు తరలిస్తామని అన్నారు.కోవిడ్ లక్షణాలు బాధితునికి మొదటిదశలో ఉంటే ఇక్కడే చికిత్స అందించి పంపిస్తామని తెలిపారు.ప్రజలందరూ మాస్క్ ధరించి సామాజిక దూరం పాటించాలని కోరారు.
No comments:
Post a Comment