కపిలేశ్వరపురం లో జయంతి వేడుకలు...
పెన్ పవర్, ఆలమూరు
పేద వర్గాల కోసం నిరంతరం పోరాటం చేసిన మహనీయులు బాబూ జగజ్జివన్ రామ్ యువత కు స్ఫూర్తి ప్రదాత గా వైఎస్సార్ సిపి యువ నేత తోట పృథ్వి రాజ్ పేర్కొన్నారు. కపిలేశ్వరపురం లో సోమవారం జరిగిన జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబూ జగజ్జివన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైఎస్సార్ సీపీ మైనారిటీ సెల్ కన్వీనర్, కపిలేశ్వరపురం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల వైసిపి ఇన్ ఛార్జ్ సయ్యద్ రబ్బానీ వైఎస్సార్సీపీ నాయకులు చల్లా దుర్గా ప్రసాద్, షేక్ అన్సార్ అలీ, మల్లిపూడి శివ కుమార్, కట్టా మురళి, చింత పెద్దకాపు, కందుల శీను, ఎం పి టి సి అభ్యర్థులు గొల్లపల్లి సోనియా, శీలం భాస్కరరావు,గుత్తులశివ,శ్రీదేవి, పిప్పర సంపత్ రావు, అంగాని నూక రాజు, బంటుమిల్లి సాయి కుమార్, కోరిపల్లి శీను, కుడుపూడి విజయ్ చౌదరి,బి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment