రహదారి ప్రమాదంలో ఒకరు దుర్మరణం
లక్షెట్టిపెట్, పెన్ పవర్మండలంలోని గుళ్లకోట స్టేజి వద్ద మంగళవారం రాత్రి లారీ బైక్ ను డీకొట్టడంతో వడ్లూరి విష్ణు(36)అనే యువకుడు మృతి చెందినట్లు ఎస్ఐ దత్తాత్రి తెలిపారు.ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం మృతుడు జమ్మికుంటకు చెందిన వ్యక్తి అని మ్యాదరిపేట గ్రామంలో బేకరిలో కార్పెంటర్ పని కోసం వచ్చాడన్నారు.మంచిర్యాలకు ద్విచక్ర వాహనంపై వెళ్లి సామాను కొనుగోలు చేసుకుని మ్యాదరిపేటకు వస్తుండగా ఎదురుగా వస్తున్న టీఎస్19టీఎ1173 నెంబర్ గల టిప్పర్ డీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందడన్నారు.అదే వాహనం వెనుకాల కూర్చున్న మరొక వ్యక్తి శరత్ కు సల్ప గాయాలు అయ్యాయన్నారు.గాయపడ్డ వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
No comments:
Post a Comment