Followers

"జీతాలు వేయండి..మహాప్రభో"

 "జీతాలు వేయండి..మహాప్రభో"

మహారాణి పేట, పెన్ పవర్

ప్రమాదకర కరోనా సమయంలోనూ ప్రాణాలకు తెగించి పని చేస్తుంటే జీతాలు కూడా ఇవ్వడం లేదని తీవ్ర వేదన ఐదు నెలలుగా జీతాల్లేక కుటుంబాలతో పస్తులు.“జీతాలు చెల్లించండి మహా ప్రభో” అంటూ ప్రభుత్వ ఘోషా ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులు ఆకలి కేకలు పెడుతున్నారు. ఐదు నెలల బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ ఘోషా ఆస్పత్రి ముంగిట ఏపీ మెడికల్  కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ధర్నా కార్యక్రమం చేపట్టింది.ఐదు నెలలుగా జీతాలు లేకపోవడంతో పారిశుద్ధ్య కార్మికుల పరిస్థితి దయనీయంగా మారిందని. 

యూనియన్ ప్రధాన కార్యదర్శి జె.డి. నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రమాదకర కరోనా పరిస్థితుల్లో కూడా ప్రాణాలకు తెగించి పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు కూడా ఇవ్వకపోవడంతో వారు తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.చేతిలో పైసా లేకపోవడంతో కుటుంబాలతో పస్తులు ఉంటున్నారని విచారం వ్యక్తం చేశారు.దిక్కుతోచని స్థితిలో పారిశుద్ధ్య కార్మికులు ఉంటే ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు.వెంటనే వారికి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.లేకుంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...