Followers

పలు కాలనీల్లో సోడియం హైపోక్లోరైడ్ ద్రవణం పిచికారి

 పలు కాలనీల్లో సోడియం హైపోక్లోరైడ్ ద్రవణం పిచికారి...

ఆదిలాబాద్ ,  పెన్ పవర్

కరోనా సెకండ్ వేవ్ లో భారీగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని మహాలక్ష్మివాడ, తాటిగూడ, చిలుకూరి లక్ష్మీ నగర్, తదితర కాలనీలలో ప్రత్యేక వాహనాలతో సోడియం హైపోక్లోరైడ్ ద్రవానాన్ని పిచికారి చేయించారు. ఇందుకోసం ప్రత్యేకంగా కేటాయించిన పారిశుద్ధ్య సిబ్బందికి సూచనలు చేస్తూ పనులను పర్యవేక్షించారు. వైరస్ నియంత్రణకు గానూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ ప్రజలకు అవగాహనా కల్పించారు.ఈ మేరకు మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్ మాట్లాడుతూ కొవిడ్ కేసులు ఉన్న కాలనీలలో ప్రతిరోజు సానిటేషన్ చేయబడుతుందని పేర్కొన్నారు. ప్రజలు సమాచారం అందిస్తే ఆ ప్రాంతాలలో కూడా హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారి చేయిస్తామని వివరించారు. కేసుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సంద నర్సింగ్, పందిరి భూమన్న, మున్సిపల్ అధికారులు తిరుపతి, అరుణ్ కుమార్, నాయకులు సంజయ్ ,సంతోష్ కుమార్ తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...