స్వీయరక్షణే కరోన నుంచి రక్షణ
విశాఖపట్నం రేంజ్ డి.ఐ.జి., శ్రీ ఎల్.కె.వి.రంగారావు ఐ.పి.ఎస్., ఈ రోజు తమ కార్యాలయము నుంచి ఈ ప్రకటన చేశారు. రేంజ్ పరిధిలో కరోనా వ్యాప్తి చాలా ఉదృతంగా ఉందని అందువలన ప్రజలందరూ ఇళ్లకే పరిమితమవ్వలని, అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. తప్పని పరిస్థితులలో బయటకు రావలసివస్తే మాస్క్ ను ధరించి, వ్యక్తుల మధ్య దూరం, సానిటైజర్ మొదలైనవి తమ ఉంచుకోవాలని తెలియ జేస్తున్నారు. అలాగే ప్రభుత్వం నిర్ధేశించిన విధంగా ప్రజలందరూ కరోనో వాక్సిన్ ను తప్పనిసరిగా వేసుకోవాలని, వేసుకున్న తరువాత కరోన రక్షణ నిబంధనలను తప్పని సరిగా పాటించాలని డి.ఐ.జి., అన్నారు. మీరు తీసుకున్న స్వీయ రక్షణ చర్యల వలన మీకే కాకుండా మీ కుటుంబ సబ్యులకు కూడా భద్రత కలుగుతుంది. కుటుంబ పెద్ద తీసుకునే భద్రత చర్యలవలన మొత్తం కుటుంబం రక్షణలో ఉంటుంది, కుటుంబ పెద్ద జబ్బు పడితే అతని కుటుంబానికి దిక్కేవరు. అందువలన ప్రజలు తమకోసం కాకుండా తమపై ఆధారపడిన కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని తగిన జాగ్రత్తలను పాటించాలని అన్నారు. ప్రస్తుత పరిస్థితులలో పెరుగుతున్న కేసులకు సమాంతరంగా వైద్యం చేయడానికి కావలిసిన పరికరాలు అన్నీ ఆసుపత్రిలలో అందుబాటులో లేవనే విషయాన్ని ప్రజలందరూ గ్రహించాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చే సూచనలను ప్రజలందరూ ఎప్పటికప్పుడు గ్రహిస్తూ వాటిని తూచ తప్పకుండ పాటించాలని అన్నారు. ఈ సందర్భంగా వర్తకులను, వ్యాపారులను ఉద్దేశించి మాట్లాడుతూ గతంలో విధించిన లాక్డౌన్ సమయంలో అన్నివర్గాల వారు పోలీస్ శాఖకు సహకరించినట్లే ఈ సమయంలో కూడా సహకారాన్ని అందించాలని కోరారు. పోలీసులు విధించిన కరోన నియంత్రణ చర్యలు తప్పని సరిగా పాటించాలని సూచించారు.
No comments:
Post a Comment