ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి విధులు నిర్వహించండి
సమయ పాలన పాటించండి
సజావుగా పోలింగ్ సామగ్రి పోలింగ్ కేంద్రాలకు తరలించండి
సి.సి.కెమెరాల పర్యవేక్షణలో పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ
ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి కూర్మనాథ్
పార్వతీపురం, పెన్ పవర్
ఎం.పి.టి.సి, జెడ్.పి.టి.సి ఎన్నికలు ఈ నెల 8వ తేదీన పోలింగ్ , 10వ తేదీన కౌంటింగ్ కు సంబంధించి ఎటువంటి అవాంతరం లేకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు చేపట్టాలని ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్ పేర్కొన్నారు. బుధవారం ఎం.పి.టి.సి, జెడ్.పి.టి.సి ఎన్నికల నిర్వహణకు సంబంధించి పార్వతీపురం, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, కురుపాం మండలాల్లో పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాలను సందర్శించారు. ప్రతి ఒక్కరు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అనుసరిస్తూ విధులు నిర్వహించాలన్నారు. పి.ఓలు, ఎ.పి.ఓలు, పోలింగ్ సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రానికి సంబంధించిన పోలింగ్ సామగ్రి సరి చూసుకోవాలని సూచించారు. అనంతరం స్ట్రాంగ్ రూమ్ భద్రత, సి.సి.కెమెరాల పనితీరు, కౌంటింగ్ కేంద్రం సంబంధిత అధికారులతో పరిశీలించారు. అనంతరం ప్రాజెక్ట్ అధికారి పనుల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. తదుపరి చేపట్టవలసిన పనులకు సంబంధించి పలు సూచనలు అందించారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించి ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ సజావుగా ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని అన్నారు. సి.సి.కెమెరాల పర్యవేక్షణలో పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని అన్నారు. ముందుగా ప్రాజెక్ట్ అధికారి మండలాల్లో పోలింగ్ మెటీరియల్ పంపిణీ కేంద్రాలలో పోలింగ్ సిబ్బందికి అల్పాహారం, భోజన ఏర్పాట్లు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, కురుపాం మండలాల తహసీల్దార్లు, ఎం.పి.డి.ఓ లు ఎన్నికల విధులకు హాజరైన పి. ఓలు, ఎ.పి. ఓలు పోలింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment