Followers

జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి.

 జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి.

 -ఖలిన్దర్ అలీ ఖాన్.  సిపిఐ పట్టణ కార్యదర్శి. 

మంచిర్యాల ,  పెన్ పవర్

 మంచిర్యాల జిల్లాలో కరోనా  వైరస్ తీవ్రస్థాయిలో పెరిగిపోతున్న నేపథ్యంలో జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని సిపిఐ పట్టణ కార్యదర్శి  జిల్లా ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరారు.  ప్రపంచ దేశాలు సురక్షితంగా ఉంటే భారత్ బయోటెక్ అనే సంస్థ వ్యాక్సిన్ కనుగొన్న ఈ దేశంలో వ్యాక్సిన్ అందక ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి అని అన్నారు. వైరస్ సోకిన వారి దగ్గర ప్రైవేట్ హాస్పిటల్ యజమాన్యాలు ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నాయి అని తెలిపారు.  ఈ విషయంలో ప్రభుత్వ యంత్రాంగం ప్రైవేట్ హాస్పిటల్ లో దోపిడి నివారించడంలో పూర్తిగా విఫలమయ్యాయని తెలిపారు. ప్రభుత్వ పర్యవేక్షణ అవసరమని పేదలందరికీ వైరస్ సోకిన వారికి ఉచిత వైద్యం ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స అందించాలని సిపిఐ డిమాండ్ చేస్తుందని తెలిపారు. జిల్లా యంత్రాంగం వైరస్ నిర్మూలనకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ యంత్రాంగం అంతా కరోనా నివారణకు దృష్టి సారించాలని జిల్లా అధికారుల కోరుతున్నాం అని అన్నారు. దేశంలో అధికారంలో ఉన్న బిజెపి  వ్యాక్సిన్ ప్రజలకు ఇవ్వడంలో విఫలమైందని, ప్రపంచ దేశాలులో  కరోనా మరణాల సంఖ్య తక్కువగా ఉండడం దీనికి నిదర్శనమని అన్నారు.  ఈ కార్యక్రమంలో  జిల్లా ఏ.ఐ. టి. యు. సి. కార్యదర్శి మేకల దాసు, జిల్లా సమితి సభ్యులు రామడుగు లక్ష్మణ్, మిట్టపల్లి పౌల్, చాడ మహేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...