Followers

అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసులకు ప్రోత్సాహకాలు

 అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసులకు ప్రోత్సాహకాలు

రాజన్న సిరిసిల్ల , పెన్ పవర్

గత నెలలో ఫంక్షనల్ వర్టికల్ వారీగా అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పోలీస్ అధికారులకు సిబ్బందికి  అప్రిసియేషన్ సర్టిఫికెట్ అందజేసిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపిఎస్. ఈ సందర్భంగా ఎస్పీ  రాహుల్ హెగ్డే మాట్లాడుతూ గత నెలలో వర్టికల్ వారిగా అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులను గుర్తించి అప్రిసియేషన్ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది అని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఫంక్షనల్ వర్టికల్ వారిగా పోటీపడి విధులు నిర్వహించి రివార్డులు, అవార్డులు పొందాలని సూచించారు. కష్టపడి అంకితభావంతో విధులు నిర్వహించే వారికి డిపార్ట్మెంట్లో కచ్చితంగా గుర్తింపు ఉంటుందని తెలిపారు. రిసెప్షన్, బ్లూ కోల్డ్స్, సెక్షన్ ఇన్ఛార్జ్, స్టేషన్ రైటర్, టెక్ టీం, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, స్టేషన్ హౌస్ ఆఫీసర్, కోర్టు డ్యూటీ, మరియు సమన్స్ అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన పోలీస్ అధికారులకు సిబ్బందికి (10) మందికి అప్రిసియేషన్ సర్టిఫికెట్ ఈరోజు ఇవ్వడం జరిగింది. ఫంక్షనల్ వర్టికల్ వారిగా అప్రిసియేషన్  అందుకున్న వారి వివరాలు

 01.లక్ష్మారెడ్డి  ఎస్.ఐ ఆఫ్ పోలీస్.తంగాలపల్లి.

02.అభిలాష్ ఎస్.ఐ ఆఫ్ పోలీస్.బోయినపల్లి

03. గీతాంజలి (రిసెప్షనిస్టు) వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ .

04. రాజేంద్రప్రసాద్ ( రైటర్) చందుర్తి పోలీస్ స్టేషన్

05. దాస్ ( బ్లూ కోల్ట్స్) సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్,

06.శివ ప్రసాద్ (కోర్ట్ డ్యూటీ ఆఫీసర్) ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్.

 07.సురేష్ (వారెంట్ అండ్ సమన్స్) ఇల్లంతకుంటా పోలీస్ స్టేషన్

08. అనూష (టెక్ టీమ్)సిరిసిల్ల టౌన్  పోలీస్ స్టేషన్,

09.  సతీష్ (క్రైమ్ స్టాఫ్) ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్.

10.ఏ. ఎస్.ఐ రామస్వామి(జనరల్ డ్యూటీ ఆఫీసర్) వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్.

వీరిని జిల్లా పోలీస్ కార్యాలయంలో లో ప్రత్యేకంగా అభినదించారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...