బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు.
మైనర్ బాల,బాలికలకు పెళ్లిలు నిర్వహించవద్దు.
సిడబ్ల్యూసి మహబూబాబాద్ జిల్లా చైర్మన్ డాక్టర్ సుంకరనేని నాగవాణి మురళీకృష్ణ.
తొర్రూరు, పెన్ పవర్మైనర్ బాల, బాలికలకు పెళ్లిలు చేయవద్దని, బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని, సిడబ్ల్యూసి మహబూబాబాద్ జిల్లా చైర్మన్ డాక్టర్ సుంకరనేని నాగవాణి మురళీకృష్ణ అన్నారు. సోమవారం మహబూబాద్ జిల్లా తొర్రూరు మండల పరిధిలో బాల్య వివాహం జరుగుతుందని, 1098కు సమాచారం రావడంతో చైల్డ్ లైన్ సిబ్బంది మైనర్ బాలికను సిడబ్ల్యూసి జిల్లా చైర్మన్ ముందు హాజరు పార్చగా కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...బాల్యవివాహం చేసిన వారెవరైనా నేరస్థులే అని హెచ్చరించారు.నేరస్థులకు రెండేళ్ల వరకు కఠిన కారాగార శిక్ష పడవచ్చు అని,లక్షరూపాయల వరకు జరిమానా విధించవచ్చునాని తెలిపారు. ఈ నేరాలకు బెయిల్ కూడా ఉండదన్నారు. ఎవరైనా బాల్యవివాహాలు జరిపితే 1098కు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని, తెలిపారు. ఈ కార్యక్రమములో అంగన్వాడీ సూపర్వైజర్ మల్లీశ్వరి, చైల్డ్ లైన్ సిబ్బంది అరుణ, ఉపేందర్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment