నిరుద్యోగులకు ఉద్యోగ నియామకాలు చేపట్టాలి..
దళితులకు మూడేకరాల భూమి పంపిణీ చేయాలి..
నిదులు నియామకాలకు ఆశపడ్డ దళిత నిరుద్యోగులు దినసరి కూలీలుగా అవతారం..
కుటుంబాలను పోషించుకోవడానికి వేరేమార్గం లేక కూలీలుగా మారిన నిరుద్యోగులు..
డిహెచ్ పిఎస్ రాష్ట్ర కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం..
సత్తుపల్లి, పెన్ పవర్తెలంగాణలో నియంత పరిపాలన కొనసాగుతుందని, కేసీఆర్ ప్రభుత్వం మాటల గారడితో నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానాల పునాదులపై అధికార అహంకారంతో ఏడున్నర సంవత్సరాలుగా రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ప్రజలకు దళితులకు ఇచ్చిన వాగ్దానాలు ఏమయాయని, తెలంగాణ రాష్ట్ర దళిత హక్కుల పోరాట సమితి డిహెచ్ పిఎస్ రాష్ట్ర కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. శనివారం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఏప్రిల్ 7వ తేదీన జరిగే డిహెచ్ పిఎస్ ఖమ్మం జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహణపై శనివారం సత్తుపల్లి గాంధీ నగర్ లో డిహెచ్ పిఎస్ ముఖ్యుల సమావేశం జరిగింది.. ఈ సందర్భంగా మందా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వస్తే మొదటి ముఖ్యమంత్రిగా దళితున్ని చేస్తానని మోసం చేసిన కేసిఆర్,, దళితులకు మూడెకరాల వ్యవసాయ భూమి పంపిణీ చెస్తామని చెప్పి మొక్కు బడిగా కొందరికి మాత్రమే భూపంపిణీ చేసి చేతులు దులుపుకున్నారని తీవ్రంగా విమర్శించారు.. ఇవాళ తెలంగాణలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగులుగా మారిన పరిస్థితి ఏర్పడిందని, అందులో ఎక్కువ శాతం మంది దళితులు ఉన్నారు. కేజీ టూ పీజి ఉచి విద్య తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని చెప్పిన వాగ్ధానం ఊసే లేదని యద్దేవా చేశారు. రాష్ట్రం వస్తే మన నిధులు, నియామకాలు వస్తాయని ఆశపడ్డ దళిత నిరుద్యోగ బిడ్డలు రోడ్ల వెంట దినసరి కూలిఅవతారం మేత్తి కుటుంబాలను పోషించుకుంటున్నారని,మందా ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు లేవు, దళితులకు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోక అరిగోస పడుతున్నా కేసీఆర్ ప్రభుత్వం విస్మరించడం సరైంది కాదని వెంటనే కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో తలేత్తిన నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, పూర్తి స్థాయిలో దళితులకు మూడెకరాల వ్యవసాయ భూపంపిణీ చెపట్టాలని, దళిత సంక్షేమానికి నిధులు కేటాయించి ప్రతి దళిత కుటుంబానికి ఎటువంటి ఆంక్షలు లేకుండా జీవనోపాధికి రుణ సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. దళితులకు ఇచ్చిన హామీలు అమలుకై రానున్న రోజుల్లో దశలవారి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో డిహెచ్ పిఎస్ డివిజన్ కార్యదర్శి తడికమల్ల యోబు, నాయకులు గరికపాటి కిరణ్ కుమార్, కిన్నెర నాగలక్ష్మి, కొత్తపల్లి కుమార్, అరుణ, బాలు,జీవన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment